ఆలు మగలు
పరిచయం లేని
రెండు మనసులు
ఊహల్లో పయనిస్తూ
కలలు కన్న
నూరేళ్ళ కొత్త జీవితానికి
తొలి అడుగు వేస్తారు
వైవాహిక జీవితంలో
ఎదురైయ్యే ప్రతీ అనుభావాన్ని
ఆస్వాదిస్తూ
మాంగల్యానికి బలం
భార్యా భర్తల మధ్య పెరిగే
అనురాగాలు, ఆప్యాయతలేనని
నిత్యం స్మరణ చేసుకుంటూ
ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుంటూ
మమ జీవన హేతునా అంటూ
ఎదురొచ్చే ప్రతీ కష్టాన్ని, సంతోషాన్ని
ఆనందంగా స్వీకరిస్తూ
రేపటి భవిష్యత్తు కోసం
రెక్కలు కట్టుకుని
ఎదురుచూసే ఆశాజీవులు
ఆలు మగలు
Also Read : చిరంజీవులు