అక్షర ఆయుధం
కవిని నేనంటూ
అక్షర ఆయుధాన్ని చేతబట్టి
ఛలోక్తులు చిలకరించు చేతి నైపుణ్యుడా
చెదలు పట్టిన రాజకీయాలను చెదరగొట్టలేవా
కలిమి నాదంటూ
అక్షర లక్ష్మిని స్మరిస్తూ
కవితాంబరాలను పూయించు పద ప్రావీణ్యుడా
పేద కడుపు ఆకలి కేకలను పూరించలేవా
కలమే నా కరమంటూ
పడతి సోయగాన్ని వర్ణిస్తూ
ప్రణయ గీతాలు కురిపించు ప్రేమారాధ్యుడా
కామోన్మాదుల అకృత్యాలను కళ్లకుకట్టలేవా
Also Read : సిరా చుక్క