కలంతో గళం
అనుభూతుల పరిమళాన్ని కలానికి అద్ది
కవితలాగ మలచి గుండెను గొంతు చేసి
భావాన్ని అందించనా
ప్రేమ పరవశాన్ని కలానికి కలిగించి
అందమైన సంతకాన్నై మనసు గళాన్ని విప్పి
ప్రేమ పావురాన్నవనా
మహనీయుల స్ఫూర్తిని కలంలో నింపి
రాబోవు తరం గళం కలిపి పాడేలా
పాటనై నిలవనా
ఎదురు నిలిచే ధైర్యాన్ని కలంతో కల్పించి
విజయకేతనపు జయ గీతాన్ని ఆలపించి
విజేతనై వెలగనా
కాలగమనపు మార్గన కలలను కలానికి అందించి
కొత్త లోకపు దారుల్లో కొంగొత్త గళంతో
భవిత నాదే అననా
పోరాడి సాధించే శక్తిని కలంతో రగిలించి
సత్యాన్ని గళంలో శంఖంలా పూరించి
నిజాన్ని నేనే అననా
సున్నితా భావాల సుమహారం కలమైతే
సూటియైన భావనల్ని పలికేది గళం
బరువైన భావాల హృద్యచిత్రం కలమైతే
ఆవేశంతో రగిలే అపరకాళి గళం
Also Read : కొత్త గీతం