Vijayadashami Poet : విజయదశమి

విజయదశమి

 

విజయదశమి
మంచినివిస్మరించి మహిషుడినిమించు
మహోన్మాదముతో ఊగిపోతున్న
మాలిన్య మదిని మదించి మమ్ము మనుషులుగా మలుచ మనుచూ
వేడుకొనరే విజయదుర్గని నేడు !
విలువలను వెక్కిరించు
వెర్రి నాగరికుల కుప్పిగంతులకు
సాంప్రదాయాల అడ్డుకట్టలేసి
ఆచారాలను వల్లించ మనుచూ
వేడుకొనరే విజయదుర్గను నేడు !
విచ్చుకోని పసిమొగ్గల్ని సైతం
చిదిమేస్తున్న అసుర కామకుల
చూపుసోకనివ్వక ఒడిచేర్చుకుని
దయతోటి సంరక్షించ మనుచూ
వేడుకొనరే విజయదుర్గను నేడు !

 Also Read : చిన్న పిల్లల కథలు 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!