విజయదశమి
పేరు లోనే విజయాన్ని ఇముడ్చుకున్నది
ఈ విజయదశమి పండుగ.
అసురుల పై అలుపెరుగని పోరాటమే
ఈ విజయదశమి పండుగ.
దసరాగా సకల జనుల నోట పలుకబడే ఈ పండుగ
నవరాత్రుల లో తొమ్మిది అవతారాల తో చెడు పై మంచి చేసే యుద్దమే ఈ విజయదశమి పండుగ
అంతటా ఆ అమ్మ మహిమలే అన్నీ స్త్రీ శక్తికి తార్కాణాులే.
అందుకే ఓ జగన్మాత నేటి కలియుగ కీచకులు తో నిత్యం అలుపెరుగని సమరం చేస్తున్న.
మహిళలు అందరికీ నీ శక్తిని ప్రసాదించు
ఆడపిల్ల నిర్భయం గా నడిరోడ్డు పై నడిచిన రోజున జరుపుకుందాం, నిజమైన విజయదశమి పర్వదినం.
Also Read : బంధం