వేద మంత్రం
మమ జీవన హేతునా
నా జీవన జ్యోతివి నీవు
నా ఆనందానికి హేతువు నీవు
నా జీవన గమనం నీవు
చేరుకునే గమ్యం నీవు
నా బ్రతుకు కు అర్థం నీవు
పరమార్థం నీవు
అని వివాహ వేళ లో
పలికే ఈ వేద మంత్రం
ఇరు మనసులను ఒక్కటిగా
ముడి వేసే ప్రణయ బంధం
Also Read : పరిణయం