నేను సైతం
వర్ణాలెన్ని మారినా మట్టి
తన పరిమళాన్ని మార్చుకోలేదు
విలువలెన్ని మారినా గాలి
మలినమంటించుకోలేదు
అలుపెరుగని ప్రవాహమై అలరించిన నీరు
స్వచ్ఛతనెప్పుడూ కోల్పోలేదు
ధనదాహపు కోరల్లో చిక్కుకున్నప్పుడు
అహంకారం పరిధులు దాటి ప్రవహిస్తున్నప్పుడు
స్వార్థపు పడగనీడలో కులుకుతున్నప్పుడు
నన్ను నేను కోల్పోతూ
నిశీధి అంచుకు వేలాడుతున్నానే కాని
ఆలోచించే మనసు
ఆచరణలో పెట్టే నేర్పూ వుండికూడా
నేను సైతం ఎందుకలా వుండలేక పోతున్నాను
నన్ను నేను ప్రశ్నించుకోవాలిప్పుడు
మనిషిగా మారే ప్రయత్నంలో
Also Read : ప్రశ్నించు