కలం కాగడా
కలం కాగడా పట్టుకొని పహారా కాయాలి
దీనులకై నిరుపేదలకై అనాథులకై
అలసిన దేహాల అశ్రుజన సందోహాల పక్షమై
జ్ఞాన వెలుగులు విజ్ఞాన జిలుగులు వేయి మెదళ్ళనొక్కసారి
నిద్ర కూపం నుండి మెలుకువ తెప్పించగా పహారా కాయాలి
గళాన్ని తోడెంచుకొని కలం కాగడాతో పహారకాయాలి
నాగరీక జీవనంలో నవ్యమైన జగతిలో
నడయాడుతూ బుడిబుడి అడుగులు
తడబడుతూ ఇప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటూ
అడ్డంకులన్నీ అధిగమిస్తూ సాంప్రదాయ చెరసాలనుండి విడుదలౌతూ
అక్షరాల వాసనను ఆఘ్రాణిస్తూ సమాజంలో
తలెత్తుకొని నిలువెత్తు నిజాయితీని మోమున పులుముకొని
అమాయకులైన అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న
మగాళ్ళనబడే మృగాళ్ళ మెదళ్ళు మేల్కొనగ
మధమెక్కిన మహాంకారం మొదలంటు పడిపోవంగ
కలం కరవాలంతో పహారా కాయాలి
గళమింత తోడుచేసుకొని
అభ్యుదయమైన భావపరంపరలతో
కలం కాగడా గడగడపలోన వెలుగించగా
మనిషి మెదళ్ళలో పులుముకున్న దూళినంతటిని
ప్రక్షాళితముగా ద్యోతకమగుపించగా
కలము గళము కలిపి మానవత్వ శంఖం పూరిస్తూ
ఆధునికతాంభర వీధిలో దివిటీ వెలిగించి
కలము గళమును దివిచంద్రులు చేసి
భువనైన లోకాభివృద్ధికి కలం కాగాడాతో పహారా కాయాలి
Also Read : కలం గళం