For love : జీవన సమరం

జీవన సమరం

జీవన సమరం

చనుబాల తీపిలో తడిసిన
లేత పెదాలతో లొట్టలేస్తూ
తల్లి ఒడి వెచ్చదనాన
ఆదమరచిన చిట్టిపాప

కనుతెరిచిన కానరాదే
ఉరుకులు బెట్టించు
ఉద్యోగాన్ని వరించిన
అమ్మబొమ్మని జీవన సమరాన

వరద వాత్సల్యానికి వారదేసి
నడిరాత్రి పలకరించు పున్నమిలా
పసి నుదిటిని ముద్దాడి మురిసి
వారాంతంలో విరగబూసే తండ్రి ప్రేమ
మన్నింపు కోరె తల్లడిల్లి
అంతుచిక్కని ఆశయంలో చిక్కుబడి
లక్షార్జనల జీవన సమరాన

అమ్మానాన్నల ప్రేమకోసం వగిచే అనాదలు
ఆయమ్మల పంచన పెరిగిన నేటి పసి పాపలు

 

Also Read :  మరణం లేని ఆయుధం

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!