జీవన సమరం
జీవితంలో అడుగడుగునా అడ్డంకులను దాటుకొని ముందుకు సాగితేనే మనం అనుకున్న విజయాన్ని పొందగలం
మన జీవితంలో సత్యం ఒడిదుడుకులను చూసి అక్కడే ఆగిపోతే మనం ఎప్పటికీ పైకి ఎదగలేం
అసలు సమస్యలు లేకుండా జీవితం ఉండదు వాటిని అధిగమించి ముందుకు సాగిపోతేనె మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది
ప్రయత్నమే చేయకుండా మన జీవితం మనం అనుకున్నట్టు ఉండాలంటే అది సాధ్యపడదు
ఎంతో కొంత కృషి ఉంటేనే మన లక్ష్యానికి మనం చేరుకోగలం
జీవితం అనేది ఒక పోరాటం ఎంత పోరాడితే అంత నైపుణ్యాన్ని పొందగలం
జీవితం లో కష్టనష్టాలను ఎదుర్కునే సామర్థ్యం మనకి జరిగిన సంఘటనల వలనో మన అనుభవం తోనో వాటిని అధిగమించగలం
జీవితం ఎంతో ఉంది అది చూడకముందే చిన్న చిన్న బాధల్ని చూసి అక్కడే ఆగిపోతే ముందుకు పయనించలేము
జీవితంలో ఎంత పోరాడిన మనశ్శాంతి లేకపోతే మనం ఎంత సంపాదించినా వ్యర్థమే అవుతుంది
జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని పోరాడి సాధిస్తే దాని నుంచి వచ్చే విలువ ఎన్ని లక్షలు పోసిన ఆ ఆనందాన్ని పొందలేము
Also Read : వైకుంఠపాళీ