అక్షరమే ఆయుధం
అక్షరాలను అమ్మ ఓడిలో బడిలో భక్తి శ్రద్ధలతో నేర్చుకో
చదువుల తల్లి అక్షరాలను అక్షింతలుగా
కళ్ళకు హద్దుకుని హృదయంలో పదిలంగా జ్ఞాపకం ఉంచుకో
అక్షరాలను అస్త్రల్లా మల్చుకో
అక్షరమే ఆయుధమైతే నిన్ను
అంధకారం నుండి వెలుగులోకి తెస్తుంది
అట్టడుగు స్థాయి నుండి అధికార పీఠం పై కూర్చో బెడుతుంది
అక్షర ఆయుధం చేతబట్టి ప్రజల్లో అజ్ఞానపు పొరలను తొలగించి జ్ఞానమనే వెలుగులో
ఆరోగ్యవంతమైన సమాజాన్నీ నిర్మించగలవు
అక్షరమే నీ ఆయుధమైతే అవినీతి పరులను అంత మొందించగలవు
అక్షరాలను తూటాలుగా మలచి ప్రజా సమస్యలపై
పోరాటం చేసినప్పుడే నీ పేరు చరిత్రలో సువర్ణ క్షరాలతో లిఖించబడుతుంది
కవులు రచయితలు అక్షరాలను సాహిత్య ఆయుధాలుగా చేసుకుని విప్లవ గీతలతో
ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించి ఫలితాలను రాబట్టారనీ గుర్తుంచుకో
Also Read : అక్షరాయుధం