‘అక్షర’మే నా ఆయుధం
‘అణ్వస్త్రా’నికి హృదయం ఉండదు
ఆకాశమంత ఎత్తున ‘విస్ఫోటనా’న్ని సృష్టించీ
‘నెత్తురు’ వరదలై పారే ‘నరమేథా’నికి తెర తీస్తుంది
విధ్వంస రచన చేస్తుంది
వినోదాన్ని చవి చూస్తుంది
అక్షరం అలా కాదు
మంచి మాటగా జన్మెత్తీ
మనషి గుండెల్లో పది కాలాలపాటు కొలువై ఉంటుంది
మనిషి మనసులో ‘మార్పు’కు తానొక నెలవౌతుంది
కరకురాతి ‘శిల’ ను సైతం ‘శిల్పం’గా మలచీ
కాఠిన్యాన్ని ‘సమాధి’ చేస్తుంది
మమతకూ మానవతకూ ‘పునాది’ వేస్తుంది
చెడు పై మంచి చేసే సం’కుల’ సమరంలో
అక్షరమే ఆయుధంగా సాగిపోయే నిత్య సమర ‘సైనికుణ్ణి’ నేను
‘అక్షర’ కృషీవలుణ్ణి నేను
అందుకే ‘అక్షర’మంటే ‘మక్కువ’ ఎక్కువ నాకు
Also Read : అక్షరమే ఒక ఆయుధం