The First Leg : మొదటి పాదం

మొదటి పాదం

 

మొదటి పాదం

ఓ మహిళ
వేయి నీ మొదటి అడుగు
పసికూనల జీవితాలతో ఆటలాడే
మానవత్వం లేని వారికి మరణ భయం కలిగించేలా

ఓ వనిత
వేయి నీ మొదటి అడుగు
కామంతో వావివరసలు మరిచే
కామాంధుల కర్కశత్వం కాల రాసేలా

ఓ అతివ
వేయి నీ మొదటి అడుగు
మూఢాచారాలకు , అత్తింటి ఆరళ్ళ కు
చరమగీతం పాడేలా

ఓ స్త్రీ
వేయి నీ మొదటి అడుగు
స్త్రీ ,పురుష భేదం లేని
సమ సమాజ నిర్మాణానికి పునాది పడేలా

ఓ ఇంతి
వేయి నీ మొదటి అడుగు
భావి భారత పౌరులు
మన సంస్కృతీ సంప్రదాయాలకు , కళలకు ,
భారతీయ విలువలకు పెద్ద పీట వేసేలా

ఓ అంగనా
వేయి నీ మొదటి అడుగు
ఏ రంగమైనా వెనకడుగు వేయక
లక్ష్యాన్ని చేరే దారుల వైపు

ఓ నారీ
నువ్వు వేసే మొదటి అడుగు
కావాలి ఎందరికో అనుసరణీయం మార్గదర్శకం

Also Read :  మొదటి అడుగు

 

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!