చరమగీతం
కలంగళం జనబలం
సమాజహితం
అభిమతంగా కలం గళమెత్తితే
అక్షరాలు ఆయుధమై అస్త్రాలు సంధిస్తాయి
అవినీతిపరుల గుండెలవిసిపోతాయి
అక్రమార్కుల దుర్మార్గాలను ఎండగడతాయి
మారణహోమ మానభంగ
పీడిత బాదితుల పక్షాన ప్రశ్నిస్తాయి
అణిచివేతకు గురవుతున్న బడుగుబలహీన వర్గాలకు
బాసటగా నిలబడతాయి
కలంగళమేత్తితే
సమాజంలో అసమానతల చాటుతుంది
మాదకద్రవ్యాలకు బానిసవుతున్న యువతను మేల్కోలుపుతుంది
నిరాశ నిస్పృహ ఆవహించిన వేళ
ఆశావాద దృక్పదం వైపు
దిశానిర్ధేశ్యం చేస్తుంది
మౌలిక వసతుల రూపకల్పనకు పల్లెలలో జనులను జాగృతం చేస్తుంది
ప్రజా ప్రతినిధుల పాలనాపరమైన లోపాలు
ఎత్తిచూపుతుంది
రాజ్యాధికారం అందించినా
పదవీచ్యుత్యుల్ని చేసినా
కారణం కలమేకదా
ఒక్కకలం కోట్లాదిమంది
గళమై ఉద్యమానికి
ఊపిరై అన్యాయానికి
చరమగీతం పాడుతుంది
Also Read : అక్షరం