The Beginning of a New Era : నవ శకానికి నాంది
నవ శకానికి నాంది
నవ శకానికి నాంది
విచ్ఛిన్నమౌతున్న కాపురాలు,
మత్తుపదార్దాలకు బానిసలౌతున్న యువతరం
సనాతన ధర్మాన్ని అనుసరించలేని అజ్ఞానం
కనుమరుగౌతున్న సాంప్రదాయాలు.
ముమ్మాటికీ ఉమ్మడి కుటుంబం లేని లోపమే
గోరుముద్దలు తినిపిస్తూ ,
మన సంస్కృతినీ సాంప్రదాయాలనీ చెప్పేటి
అమ్మమ్మా,తాతయ్యలు
అనాధలుగా ఆశ్రమాల్లో మగ్గిపోతుంటే
అమ్మా,నాన్నలు
కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ
ఎదిగే వయస్సులోని పిల్లలను.
విద్య పేరుతో నాలుగుగొడల మధ్యన బందీలను చేస్తుంటే.
మన చరిత్ర సాంస్కృతి సాంప్రదాయం
పిల్లలకు అందని ద్రాక్షపండుగా మారుతుంటే.
మన “పెంపకంను”ప్రశ్నించుకోలేని
నిస్సహాయత వెంటాడుతంటే!
నుదుటిపై రాతలను తలుచుకుంటూ
కర్మ సిద్దాంతాన్ని నమ్ముకుంటూ
ఎదగ లేక ఒదిగి పోతున్నా ప్రతిఒక్కరూ
తమ “పెంపకాన్ని” ప్రశ్నించుకో లేక పోతుంటే
దేశానికి సైంటిస్టులు.
ఇంజనీర్లు.డాక్టర్లను ఎలా అందించగలం.
మన పెంపకంలోని లోపాలను సరిదిద్దుకుంటూ
రేపటి తరానికి బాసటగా నిలుద్దాం.
మొక్కై వంగనిది మానై వంగునా!
అనేది యధార్థమే కదా
మన దేశ భౌషత్ మన పిల్లల “పెంపకం”పైనే
ఆధారపడి ఉంది
మంచి తల్లిదండ్రులుగా మనం మారాలి.
మన “పెంపకం “నలుగురికి ఆదర్శంగా నిలవాలి.
మన పిల్లల సత్ప్రవర్తన కోసం
పెంపకాన్ని సరిదిద్దుకుందాం!అడుగిడదాం
నవశకం వైపు
Also Read : నా బలం నా తెలుగు