ఆరంభం
అక్షరమే ఆయుధమై గొడవయింది
కాళోజి “నా గొడవయింది”
అక్షరమే ఆయుధమై అంజలయింది
ఠాగూర్ “గీతాంజలి” అయింది
అక్షరమే ఆయుధమై ఇజం అయింది
కారల్మార్క్స్ “మార్క్సిజం” అయ్యింది
అక్షరమే ఆయుధమై ప్రస్థానమయింది
శ్రీ శ్రీ “మహాప్రస్థానం”అయింది
అక్షరమే ఆయుధమై శుల్కమయింది
గురజాడ అప్పారావు “కన్యా శుల్కమయింది ”
అక్షరమే ఆయుధమై రాత్రయింది
బాలగంగాధర్ తిలక్ “అమృతం కురిసిన రాత్రి”అయింది
అక్షరాలే ఆయుధాలై సురవరం “గోల్కొండ పత్రిక”ల్లో ప్రజల ఆవేదనై రగిలాయి
అక్షరాలే ఆయుధాలై కృష్ణమాచార్యుల “అగ్నిధారై”అజ్ఞానతిమిరాన్ని తరిమాయి
జాషువా “గబ్బిలమై”మగ్గిపోయిన జీవల్లో జ్ఞానజ్యోతులుగా వెలిగాయి
రంగాచార్యుల “చిల్లర దేవుళ్ళై” నవ సమాజంలో వేకువను నింపాయి.
Also Read : అక్షరమా