జీవితానికి ఆధారం
చిన్నప్పుడు బడికి సంచి తగిలించుకుని వెళ్తూ
పలకపై అక్షరాలు దిద్దుతూ,
గురువులు చెప్పినట్టు నడుచుకుంటూ,
అక్షరాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు తెలీలేదు
ఆ అక్షరాలే మమ జీవనానికి హేతువని.
అమ్మచెప్పిన మంచి మాటలు
అనిశమ్ము ప్రకాశించే తెలివితేటలు
నాన్న నేర్పిన అడుగులు
నా జీవిత గమనానికి మార్గాలు.
అమ్మ నేర్పిన సంస్కారం
నాన్న నేర్పిన వినయ, విధేయతలు
గురువులు నేర్పిన క్రమశిక్షణ
ఇవే నా జీవనానికి హేతువులు.
అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలు
నా జీవిత సుగమమం అవడానికి మార్గాలు.
పుస్తక జ్ఞానం ద్వారా నేర్చుకున్న విషయాలు తెలివితేటలకు నిదర్శనాలు.
సమాజం ద్వారా నేర్చుకున్న పాఠాలు.
నా జీవితానికి గుణపాఠాలు
నీతిగా జీవించడం
నిజాయితీగా బ్రతకడం
ఆపదలలో సహాయం చేయడం
పెద్దవారిని గౌరవించడం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం
మమ జీవనానికి హేతువులు.
కని,పెంచి పోషించిన తల్లిదండ్రులు
అక్షర జ్ఞానం అందించిన గురువులు
తోడు నీడలా ఉండే స్నేహితులు
నా జీవితానికి ఆధారం.
Also Read : మమ జీవన హేతునా