భక్త రామదాసు
భారత దేశంలో హిందువుల ఆచార వ్యవహరాలు,సంస్కృతి, సంప్రదాయాలు, వేశ భాషలు ఒక్కొక్క విధంగా ఉంటాయి.
భారత దేశంలో ఎంతో మంది వాగ్గేయకారులలో మన తెలుగు వాడై నా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో భక్త రామదాసు ఒక్కడు (Telugu Vaggeyakara).
భద్రచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న.ఈయన 1620లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో లింగన్నమూర్తి, కామాoబ దంపతులకు జన్మించాడు.
భక్త రామదాసు తన మేనమమ అయిన అక్కన్న, మాదన్న, ఇరువురు అప్పటి ముస్లిం రాజు గోల్కొండ కోట ప్రభువు తానిషా దగ్గర భక్త రామదాసు మేన మామలు పెద్ద ఉద్యోగులు, వారి సలహా మేరకు భక్త రామదాసుకు తహసీల్ధార్ ఉద్యోగం ఇచ్చి కోలువు చేయమన్నారు.
అందుకు రామదాసు తాసిల్దార్ ఉద్యోగం చేస్తూ,కమలమ్మ అనే యువతిని వివాహం చేసుకున్నడు.అలా జీవనం సాగదీస్తున్నారు.
భక్త కబీరుదాస్ ముస్లిం వ్యక్తి,అయినా హిందూ మతము హిందువుల దేవుడైనా, శ్రీ రాముడి పట్ల తన భక్తి చాటు కునేవడు.
ఆయన మన భక్త రామదాసుకు కనిపించి,శ్రీ రాముడి మంత్రోపదేశం చేసి ఇచ్చాడు.అప్పటి నుండి శ్రీరాముడిని పూజిస్తూ,పరమ భక్తుడు గా భక్త రామదాసు కీర్తనలు రచించారు.
తెలుగు వాగ్గయకారులలో ముఖ్యమైనటువంటి వ్యక్తి భక్త రామదాసు అని చెప్పోవచ్చు.భక్తరామదాసు తహసీల్ధార్ గా పనిచేస్తున్నప్పుడు,
పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి శిథిలా దశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని రామదాసు ను కోరగా, స్వతహాగా హరి భక్తులైన అందుకు అంగీకరించాడు.
ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాల లేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, భద్రాచలం శ్రీ రాముడి గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము భద్ర చల శ్రీ రాముడి గుడి మందిరన్ని నిర్మించి,తానిష ప్రభు ఆగ్రహానికి లోనయ్యాడు.
అందువల్ల తానిషా ప్రభువు రామదాసుకి జైలు శిక్ష విధించాడు.భక్త రామదాసు తను రచించినటువంటి కావ్యాలు, రచనలు,శతకాలు , ర కీర్తనలతో శ్రీ రాముడిని స్తుతిస్తూ ఉండేవాడు.
శ్రీ రాముడు సాక్షాత్తు రామదాసు కి కనిపించి వారి రచనలకు ఆరాధ్యుడినని పేర్కొన్నాడు . భక్త రామదాసు గొప్ప తెలుగు వాగ్గేయకారుడిగా స్థానం సంపాదించుకున్నాడు..
Also Read : తెలుగు సంప్రదాయం