భారతీయత – సాంప్రదాయాలు
భారత దేశం భిన్న సంస్కృతులకు విభిన్న సాంప్రదాయలకు పెట్టింది పేరు.
భిన్నత్వం లో ఏకత్వం కలిగియుండడం భారతదేశ విశిష్టత. ఎన్నెన్నో వైవిధ్యమైన ఆచారాలు,సాంప్రదాయాలు మన దేశంలోనే అధికం.
మన దేశలోన స్త్రీలను గౌరవించే సాంప్రదాయం అనాదిగా వస్తున్నదే.
మనం స్త్రీలకు ఇస్తున్నంత గౌరవం మరే దేశం లోను బహుశ లేకపోవచ్చును. మనం స్త్రీమూర్తును దేవతలుగా ఆరాధిస్తాము.మనదేశాన్ని సైతం భారతమాతగా భావిస్తాం.భారత్ మాతాకి జై అంటూ నినదిస్తాం. ఆ నినాదమే మనల్ని ఐక్యంగా కలిపి ఉంచుతుంది అని గాఢంగా విశ్వసిస్తాము.ప్రాణులన్నీ నివసిస్తున్న మన ఈ ధరిత్రిని సైతం మన భూమాతగా పూజిస్తాము.
మనుస్మృతి సైతం :
“యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అని చెబుతుంది ”
అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు సంతోషిస్తారు” అని, విషయాన్నే తెలుగులో చెప్పాల్సివస్తే ఇలా చెప్పవచ్చు.
తే.గీ.
స్త్రీలు పూజించబడు చోట దేవతాళి
వాసముండును శుభములు వరలుచుండు
వారికవమానమగుచోటవాడు సిరులు
పనులు చెడిపోవుతుదకునిష్పలములౌను.
మనభారతీయ సాంప్రదాయములో స్రీలకు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో ఇవి తెలుపకనే తెలుపుతున్నాయి.
పురాణ కాలం నుండి కూడా స్రీలకు విశేషమైన ప్రాముఖ్యత ఇస్తూనే ఉన్నారు..
పంచ మహాపతివ్రతలుగా వీరిని మన సంస్కృతి గుర్తించింది.
1) తార (బృహస్పతి భార్య)
2) అహల్య
3) మండోదరి
4) కుంతీదేవి
5) ద్రౌపది
అహల్య ద్రౌపది సీతా తారా మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్య మహా పాతక నాశినః. వీరిని నిత్యం స్మరించి నంత మాత్రాన మహాపాతకాలుకూడా నశిస్తాయని విశ్వాసం.వీరితోపాటు సీత,సావిత్రి, అరుంధతి, అనసూయ.మొదలగు వారలు కూడా పూజించబడడం మనం చూస్తున్న విషయమే..
స్త్రీలు లేకుంటే పురుషుల పని గోవిందానే కదా వారు లేకుంటే వీరు అసంపూర్ణులేగా..
స్త్రీలకు అనాది నుండి కాక సింధూ నాగరికత కాలం నుండి కూడా భారతీయులు స్త్రీలను గౌరవిస్తున్నారు.
బమ్మెర పోతనామాత్యుడు కూడా స్త్రీమూర్తులకు విశేషమైన ప్రాదాన్యతనిచ్చి స్తుతించాడు.
“అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లోోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.”
ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగము చేశారు. మహత్వమునకు బీజాక్షరము ‘ఓం’ కవిత్వమునకు బీజాక్షరము, ‘ఐం’ పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము, ‘హ్రీం”, సంపదలు లక్ష్మీదేవి ‘శ్రీం’ ‘ఓంఐంహ్రీంశ్రీం’ అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రే నమః’ బీజాక్షరములతో,తెలుగులో అపురూపమైన పద్యాన్నందించారు.
ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీలు విశేషమైన గౌరవాన్ని పొందు తున్నారు .అనేకానేక రంగాలలో రాణిస్తున్నారు.వారు నేర్చుకోలేని విద్య ఏదీ లేదు.
చిలకమర్తి గారి పద్యం గుర్తుకు చేసుకోవచ్చును .
“చం-
చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.!”
దీని అర్ధం.. ఆడవారు ఏ విద్య అయిన ఇట్టేనేర్చుకుంటారు.ప్రేమతోనేర్పిన,అని రంగాలలో స్త్రీలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, మాంచాల శ్రీ మతులు ఇందిరా గాంధి, సరోజనీనాయుడు,సుచేతా కృపాలాని, జయలలిత,ప్రతిభాపాటిల్,జ్యోతిరావుపూలే,మమతాబెనర్జి.అన్ని రంగాలలో రాణిస్తున్నారు.
మన భారత దేశంలో స్త్రీలను గౌరవించడమనే సంప్రదాయం అనాదిగా ఉంది.అది ఇప్పటికీ కొనసాగుతుంది.
Also Read : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ