Telugu Tradition : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 

తెలుగు సంప్రదాయం

 

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 

భారతీయ సంప్రదాయాలను ప్రపంచదేశాలే అత్యుత్తమమైనవిగా, ఉన్నతమైనవిగా అంగీకరించినవి. హిందూ సంప్రదాపయాలను కొనియాడని దేశం ప్రపంచ పటములోనే లేదంటే అతశయోక్తి కాదు.

భారతమంటే హైందవం!
హిందూత్వమంటే భారతం!!

భారతీయ సంప్రదాయమన్నా, హిందూ సంప్రదాయమన్నా ఒక్కటే.  కొన్ని ఉదాహరణలు, కట్టు, బొట్టు, మడి ఆచారాలు, ఆహార నియమాలు, పూజా విధానాలు, పండగల పద్ధతులు, ఇంటి మరియు సంఘ మర్యాదలు (Telugu Tradition ) .

ఇలా చెప్పుకుంటూ పోతే,ఇవి చాలా కొన్ని మాత్రమే.ఇక వేదాలలోకి  వెళితే ‘అనంతంగా’ ఏర్పరిచారు మన దేవతలు, రాజర్షిలు, ఋషి పుంగవులు, రాజులు మొదలైనవారు.  ఇవన్నీ మన మనుగడ సుగమం చేయటానికే.

ఇన్నింటిలో నాకు చాలా ఇష్టమైన సంప్రదాయం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఒక ఇల్లు లేదా సంసారం చక్కగా నెలకొల్పబడిందంటే, అందులోని  వివాహ వ్యవస్థ, ఆచార, వ్యవహార, సభ్యత, సంస్కారం,సంప్రదాయాలు చక్కగా ఉన్నాయని అర్థం.

ఒక దేశ శ్రేయస్సు ఆ దేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీదే ఆధారపడివుంటుంది.  ఈ కుటుంబ వ్యవస్థ సరిగ్గా, పటిష్టంగా, బలంగా వున్నచోట, వివాహ వ్యవస్థ, మానవతా విలువలు, గౌరవాభిమానాలు, “టీం స్పిరిట్ , లీడర్ షిప్ గుణాలు, మనీ మానేజ్మెంట్ , మైండ్ కంట్రోల్, పరిశీలన అవగాహన, ఎకానమీ” మొదలైన విలువలు  వాటంతట అవే నరనరాన జీర్ణించుకపోయే జీవన వ్యవస్థ ప్రబలంగా ఏర్పడుతుందని నా ప్రగాఢ విశ్వాసం.

కనుక ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (Telugu Tradition ) అనే సంప్రదాయం గురించి మరి కొంత తెలుసుకుందాం.

ఈ వ్యవస్థ ముత్తాత, తాత, కొడుకుల, మనుమల, మునిమనుమలచే ఏలబడి,అలా అలా భావి తరాల వరకు ఆచార, వ్యవహార, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరి చేత, బాధ్యతాయుతంగా పాటించబడే విధంగా నెలకొల్పపడి వుంది.

మావటివాడు-ఏనుగులా, రౌతు-గుర్రంలా,వీరిచేత సంసార చక్రాలు ఒక నిర్భంధమైనా, స్వేచ్ఛతో, పరిగెత్తించగల సామర్థ్యం వీరిలో వుంటుంది.                 ఇంటిల్లిపాదీ ప్రజలైతే, ఈ యజమానే రాజు లేదా ప్రధానమంత్రి.

ఇందులోనే మనం లోకసభ, రాజ్యసభ, ఇతర అనేక (ఏ పేరు లేని) డిపార్టుమెంట్లు,  సంపూర్ణంగా పరిపూర్ణతతో నడపబడ్డాయి. ఇవన్నీ మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారానే అనాధిగా వస్తున్న మన  భారతీయ హైందవ సంప్రదాయం.

హోమ్ (నాయనమ్మలు) డిపార్టుమెంటుకు సంబంధించినదంతా స్టేట్ గవర్నమెంటు. తాతయ్యది సెంట్రల్! డిపార్టమెంట్ల, నిర్వహణాధికారుల పేర్లు (బాబాయిలా/మామయ్యలు) ఆప్షనల్ లేదా వుండవు.  అందరికీ అన్ని పనులూ రావాలి-చేస్తారు.

అందరూ రోడ్లమీద సైకిళ్ళమీద, బండ్లమీద పోతున్నట్టే వుంటుంది, ఎక్కడా రవ్వంతా రణగొణ ధ్వనే వుండదు-చిన్న ఆక్సిడెంటు కూడా అవదు. అసలు ‘సిగ్నల్’లే వుండవు.  ఐనా ‘కంట్రోల్డ్’గా వుంటుంది (వుంటుండె) ఈ వ్యవస్థ.

‘ఫార్మింగ్’ నుండి ‘ఫామిలీ అంబాసిడర్’ దాకా అంతా ‘టైగర్’ లాంటి యజమాని నిర్వహణా  ‘మేజిక్’.  అసలు ఇంటి సభ్యులంతా యజమానులె,  ఓ వయసొచ్చాక,ఒక్క చిన్న పిల్లలదే  గోలా వేడుకలు, మిగతాదంతా ‘సైలెంట్ మెకానిజమ్’ లు.

చిన్నపిల్లలందరికీ నాయనమ్మే డాక్టర్. తోడికోడళ్లందరిదీ టీం స్పిరిట్, టైం మానేజ్మెంట్.   బాల్యం నుండి యవ్వనం లోకి అడుగిడుతున్నవారి సమస్యలకు బాబాయ్/మామయ్య లేదా అత్త /పిన్ని లే మంచి ‘సైక్రియాట్రిస్టు’లు.  పెద్దమామయ్యలు/పెద్దనాన్నలంతా ‘మోటివేషనల్ స్పీకర్స్’.

దేవుళ్ళ, తాతయ్యల/నాయనమ్మల  పేర్లు మనుమలకు, మునిమనుమలకు పెట్టే సంప్రదాయంలో  వారి యెడల ప్రేమ, భక్తి, చిన్నవారి విధేయత, గౌరవం, కనిపిస్తాయి.

అన్నివిభాగాలను కట్టిపడేసే మంత్రం,కనిపించని ప్రేమ, అదరణలే. వేరే దేశస్థులు (చుట్టాలు) వచ్చారా ఇక పండగే పండగ. గౌరవ మర్యాదలు,  ఇచ్చిపుచ్చుకోవడాలకు కొదవే లేదు.

‘డార్లింగ్! నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలతో ఆడుకోవట్లేదు, పోట్లాడుకుంటున్నారు’ లాంటి లేదా ‘విడి ఆకులు’ లాంటి సమస్యలు లేని సమాజమును తలపించే, అంతా సంతోషాల ప్రశాంతమైన జీవన సరళిని  ఇచ్చే ‘ఉమ్మడి కుటుంబ సంప్రదాయం’ (Telugu Tradition ) నకు జోహార్లు! జేజేలు!!

 

Also Read : సుఖీభవ

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!