Telugu Thalli : తెలుగు తల్లి
తెలుగు తల్లి
తెలుగు తల్లి
అమ్మ ప్రేమ అమృతం అయితే..
అమ్మ భాష ఆ అమృతసేవనమే ..
నుడికారాలతో అలంకారంగా నిలిచిన తెలుగు
ప్రకృతి శోభతో సొగసులీనుతూ వెలుగుతుంది..
అమ్మ అనురాగ లాలనలతో పెంచుకున్న బుజ్జి పాపాయి
పరువాల బరువుతో కొత్తకోర్కెలను లంగా ఓణీల లో దాచే
సత్ సాంప్రదాయ సరిగమల రాగాల సంగీతమే తెలుగు
అరువు తెలుచ్చుకున్న ఆంగ్లం ఎప్పటికి
వడ్డీ కట్టవలసిన అప్పు భాషే అవుతుంది
దేశ విదేశాలలో విజయకేతనం ఎగురవేస్తూ
తెలుగువారు మన భాష ఔన్నత్యాన్ని చాటుతున్నారు
ఎందరో సాహిత్యకారులకు జన్మనిచ్చిన ఈ నేలపై
పుట్టిన మనమీ మట్టి ఋణం తీర్చుకుంటూ
భావితరానికి తెలుగు పలుకుల తీయదనాన్ని తెలియజేద్దాము
సంస్కృతీ సంప్రదాయాల విలువలను కాపాడుకుందాము
తెలుగు తల్లి మెడలోని ముత్యాల సరాలల్లే భాసిల్లుదాము
Also Read : అమ్మ భాష