Telugu Poem : కావడి కుండలు
కావడి కుండలు
కావడి కుండలు
సంసారమనే ఊబిలో చిక్కుకున్న మనుష్యులు
బరువు భాద్యతలు పంచుకునే శ్రామికులు
అడుగు కలుపుతూ, సర్దుకుపోతున్న ఆరాధ్యులు
కుటుంబ శ్రేయస్సు కోరే ఆప్తులు
ఏడు అడుగుల బంధం పై గౌరవం
వేసే ప్రతి అడుగు ఒకటిగా సాగే పయనం
సుఖం కాదులే భాద్యత గొప్ప విషయం
విడవరులే నాతిచరామి మంత్రం
సంసారంలో సమస్యలు ఉండనీ
తీరని సమస్యలతో కళ్ళు చెమ్మగిల్లనీ
అమావాస్యను తలపించేలా బ్రతుకు భారమవనీ
ఒకటే లక్ష్యమంటూ సాగెదరు ఇరువురు
ఆనందాలు పంచుకుంటూ
బాధల్ని తీర్చుకుంటూ
నడిపించెదరు సంద్రంలో నావ అంటూ
ఒడ్డుకు చేర్చేదరు, ఇది సాద్యమేనంటూ
Also Read : కృషిని నమ్ముకో