Telugu Poem : పెంపకం
పెంపకం
బంగారుమయం
నీతిని ఉగ్గు పాలలో అరగదీసి
నియమాలను ఒక్కొక్కటిగా పేర్చి
అడిగే ప్రతీ ప్రశ్నకు
అనుకూల ధోరణిలో సమాధానమిస్తూ..
పద్ధతుల పేరుతో పిల్లల
స్వేచ్ఛను హరించక
మంచి అవకాశాలు కల్పిస్తూ
ఆట విడుపుగా బిడ్డలకు
సమయం కేటాయిస్తూ..
వారి ప్రతీ అవసరం తెలుసుకుంటూ
దయ,బాధ , కష్టం , సంతోషమనే గుణాలను
సందర్భానుసారంగా పరిచయం చేస్తూ
జీవితంలో ఎత్తు పల్లాలను
వివరిస్తూ..
గారాబానికి దూరం గా ఉంచుతూ
పెంపకంలో
ముందుకు అడుగులు వేస్తే
పిల్లల భవిష్యత్
బంగారుమయం
అదే కదా కన్నవారికి ఆనందమయం.
Also Read : స్వయంకృషి