Telugu – Light : తెలుగు – వెలుగు

తెలుగు - వెలుగు

 

తెలుగు – వెలుగు

మన భాష తెలుగు – మన శ్వాస తెలుగు
మన భవితలోన వెలుగు – తెలుగుతోనే కలుగు
సకల భాషలకన్నా సుందరమైన భాష
విదేశీయులు సైతం కీర్తించదగిన భాష
అమృతంబు కన్నా తియ్యనైన భాష
అమ్మ ఒడిలో నేను కమ్మగ నేర్చుకున్న భాష
అజంతా భాష నా మాతృభాష
నాన్న ఎదపై నేనాడుకుంటూ నేర్చుకున్న భాష
అవ్వ బువ్వపెడుతూ చెప్పిన కథల భాష
తాతయ్య ప్రేమతో నను ముద్దాడి నేర్పిన ముద్దుపలుకుల భాష
బంధం విలువ నేర్పుతూ నాతో బంధం ఏర్పరచుకున్న భాష
నా మాతృభాష నా తెలుగు భాష
నుడికారమ్ముల తోటి నాట్యమాడే భాష
మాండలికముల తోటి మురిపించే భాష
యాస ప్రాసలతో అలరించే భాష
అలంకార ప్రాయముతోటి అందమైన భాష
ననుగన్న భాష నా తెలుగు భాష

Also Read :  ఓనమాలలో ఒద్దికైన నా తెలుగు

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!