Telugu Book Review : చివరకు మిగిలేది – బుచ్చిబాబు

చివరకు మిగిలేది -బుచ్చిబాబు

 

చివరకు మిగిలేది -బుచ్చిబాబు

1952 లో వచ్చిన నవల “చివరకు మిగిలేది”. ఇది నవలా సాహిత్య రచనలో ఎన్నదగినది. భావుకతకు, లోతైన తాత్వికతకు, గాడమైన రచనాశైలికి, కథ సాంద్రతకీ పెట్టింది పేరు. బుచ్చిబాబుగారి విజ్ఞాన సముపార్జన తగుపాళ్ళలో మణిహారంలా మెరిసింది. ఇది పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష రాసే విద్యార్థులకు సిలబస్ గానూ నిర్ణయించ బడినది.

తాత్త్విక మూలాలను విశదపరిచే కోణం నవల ఆసాంతం అమాంతం పట్టు తప్పని పరుగున పరమగాఢత నిచ్చిన రచనా శైలి. ఇది రచయిత మాటగ 16 మాసాలపాటు ఏకబిగి రచనా పాటవంతో సాగిన నవలా ప్రయాణం.

1943 నాటి రాయలసీమ ప్రాంతంలో కవిని కలవరపరిచిన పరస్పర ద్వేషం, అసహనం నవలా ప్రేరకాలు. ఇరుగు పొరుగు ద్వేషచిహ్నాలు మూలాలు. సర్కారు జిల్లాలు. రాయలసీమ వారి ఐక్యతా సిద్ధంగా ఆంధ్ర సాధన జరగాలనే వారి మధ్యగల అంతర్గత ద్వేషాన్ని జల్లెడ పట్టింది.

ప్రేమ రాహిత్యం లో యిరుక్కున్న సర్కారు జిల్లాల వాసి రాయలసీమలో జీవితం ప్రారంభించినా ఎక్కడా ఏమీసాధించలేని బేలతనంతో మూణ్ణాళ్ళ జీవితంలో అన్నీ గతించినా మనిషి గుండెలు బాదుకోవలసిన అగత్యం లేదనే పట్టుదల, కార్యశీలత, సాధనలో ఈ భావన నలుగురితో పంచుకుంటే పోతుందనే ప్రేరణతో నవలకి శ్రీకారం చుట్టిన రచయిత.

పెద్దల తప్పిదాలు పిన్నలపై పడి వారి వికాసాన్ని దెబ్బ తీసే వైనం, ఒకరి అపచారాలకి వేరొకరు బాధ్యు లై బాధపడటం అనేది సామాజిక, నైతిక విలువలకి తిలోదకాలు వదలడం కనబడుతుంది.

ఇది ప్రధాన వస్తువుగ తన తల్లిని గురించి సమాజంలో చాటుగ కట్టుకథ లేవో వింటున్న కొడుకు జీవితం ఎన్ని విధాల కుంటుపడునో చిత్రించడమే ఈ నవల లక్ష్యమని రచయిత చెప్పినట్టు ప్రేమ రాహిత్యానికి, ద్వేషానికి ఏదో కారణం వుందని దాని గవేషణగ ఈ నవలా రచన సాగినట్టు కనిపిస్తుంది. రచయిత తన భావన కూడా యిదే అని చెప్పుకున్నారు.

ఈ నవల చివరలో నాయకుడు జీవితం అర్థం లేదనే నిర్థారణకు రావడాన్నిరచయిత ప్రచారం చేయదలచుకో లేదు. అది ఆ పాత్ర స్వభావ సిద్ధంగానే చిత్రించాడు. పాండిత్య ప్రకర్ష వున్నప్పటికీ కథ,కథన సంవిధానాలలో యిమిడింది.

దీనికి” ఏకాంతం”పేరు పెడదామనుకున్న రచయిత” చివరకు మిగిలేది.” అన్నారు. జీవిత రహస్యాన్ని మానవుడు తెలుసుకోవాలనే రచయిత చేసిన ప్రయత్నం ఇదే నవలకు పునాది అని రచయిత అభిప్రాయం కాస్త విశ్వజనీన రచన తాత్విక పరమైన, గాఢమైన పరిశీలన అన్నీ నవలలో సందర్భాానుసారం ఆలోచనలను తడుముతాయి.

11 అధ్యాయాల సమాహరంగా సాగిన నవల అన్ని అత్యద్భుత రచనా పాట వాలే. కథాంశాలే. ఘట్టాలే. గడ్డిపోచ విలువెంత లో కోమలి సుతిమెత్తని అనురాగం. అమ్మపోయాక గడ్డిపోచలా చివరకు మిగిలింది. తను అనుకుంది. అతన్ని గడ్డిపోచలా తీసిపారేసింటే మృత్యువు కూడా తల్లిని గడ్డిపోచలా తీసి పారేసిందని కోమలను కుంది.

అనుభవానికి హద్దులు లేవంటూ 2వ ఆధ్యాయంలో దయానిధి 7 మాసాల సెలవులనంతరం ఊరు చేరుకుంటాడు. తనది కాని శరీరాన్ని వెదికి తెచ్చుకోవాలనే తాపత్రయంతో నన్ను వదిలెయ్యి అనడం ఇది రక్తి కట్టడానికి దోహదం చేసిన అంశంగ కనబడుతుంది. మూడునాళ్ళ ముచ్చట లో ఫిలాసఫి ఆనర్స్ రెండో ఏడు చదువుతున్న రాజభూషణం హిందూ,ముస్లిం కలయికకి బీడీ కార్చినట్టు అనడం, చుట్ట వార్ధక్యానికి చిహ్నం హిందూదేశంలో అనడం మెటఫరిజమే.వెంకటాద్రి తమ్ముడు, మాధవయ్య లిద్దరూ పోలీసుశాఖ. మాధవయ్య మచ్చలేని సర్వీసు వెంకటాద్రిది నల్లమచ్చ.

చప్పుడు చెయ్యని సంకెళ్ళు లో దయానిధి చివరి సంవత్సరం పరీక్షలు దగ్గర పడ్డాయి. అమృత తో సంభాషణ సందర్భం లో
మినహాయింపు లేని ఒక మానవ జాడ్యం వెలిబుచ్చే మాటలివి.” మన నిజ స్వరూపం మనం చూసుకోలేం. ఇతరులు చెబితే సహించలేం. మనలని మనం మోసగించు కుంటూ, ఆత్మవంచనకి లోబడి రోజులు గడిపే నటులం మనం అందరం” అనడం కనిపిస్తాయి.

సౌందర్య రాహిత్యం లో ఐతే ఏలూరులో ప్రాక్టీసు పెట్టిన దయానందం,దశరథరామయ్య తన మూడెకరాల పొలం అమ్మిన మొత్తం వెనకేసుకుని ప్రాక్టీసు సరంజామా తెచ్చుకుంటాడు. కోమలి గురించిన తలపున శ్యామల గదిలోకి వచ్చి గది వాతావరణ పరిశీలన తరువాత నిధి రావడం, కట్టుబాటు పంజరంలో చివరగా నిధి అందులోంచి రెండు చిలకల్ని గిరవాటేసి పరోక్షంగా తాను స్త్రీ కి ఇచ్చిన స్వేచ్చ ను గురించి చెప్పడం బాగుంటుంది.

స్వయం సంస్కారం లో దయానిధి- కృష్ణమూర్తి టెన్నిసు ఆటలో క్రిష్ణ మూర్తి విజేత. నిధి క్లబ్‌ స్నేహితులు కూడా అదోరకం మాటలాడుకుంటారు తనపై. ఇంకా శ్యామల గురించిన హేళన. అనంతరం1937 ఏప్రిల్ నుంచి దయానిధి డిస్ పెన్‌ సరికి అద్దె కట్టగలుగుతున్నాడు. సగం మంది ఫీజు ఇవ్వరు. అతికష్టంగా ఐనా కడుతున్నాడు.విధి విధిలేక తను రాసుకున్న వ్యాసం మరో సారి చదువుకున్నాడు.

చీకటి సమస్య లో షేక్‌స్పియర్ హామ్లెట్ నాటక ప్రస్తావన ఆద్యంతం ఆలోచనీయం.హామ్లెట్ ఆదర్శజీవి. అమృతం, నిధి సౌందర్య పు వెలుగులో భరించలేక పోతున్నపుడు.ఆమె బావా అనగానే ఇద్దరూ ఒక ఆత్మ అయి వెలుగుతారు. అక్కడి నించి ఉదయం 4 గంకి బెజవాడ బయలుదేరుతాడు.

రాళ్ళసీమ లో దయానిధి 2 వారాల క్రితం కర్నూలుకి వస్తాడు. ప్రాక్టీసుకోసమని.అందగత్తె కాత్యాయని విషయమై రాజభూషణం దయానిధిపై తిరగబడతాడు. ఎంతమంది స్త్రీలతో గడుపుతావని గదమాయిస్తాడు.

కాత్యాయని సంతతి లో 8 మాసాలు గడిచాక న్యాయంపల్లి న్యాయంపురంగా మారింది. రాయలసీమలో రాళ్ళుతప్ప మనుఘలు లేరని మొరటు పనుల వారిని చూసి నిధికి కలిగిన అభిప్రాయం. లిబిడో ఇంకా స్థిరమవలేదు అంటూ”repressions are rendered impotent unless they achieve finality thought the unconscious in this case the balance between the unconscious and conscious plans of activity moral and physical has been disturbed to the detriment of general psychosis”
ఈ ఆంగ్ల వాక్యాలను పరిశీలిస్తే సిగ్మండ్ ప్రాయిడ్‌ మనో విశ్లేషణ రచయిత మనో ధర్మం లోంచి కథానాయకుని మానసిక స్థితికి ఆపాదించబడింది అని అర్ధమవుతుంది.చివరగా అతనికి కోమలి ఆలంబన కలిగినప్పటికి స్త్రీ జాతిపై నమ్మకం పోయినందుకు అమ్మకారణం అనుకుంటాడు.
జమిందారు. కోమలిని బలవంతం చేసిన విషయం నిధితో చెబుతూ తాను తిరగబడి రక్కిన విషయం చెప్పి అవన్నీ మరిచిపోయి గోముగా ప్రేమగా కలిసుండ మంటుంది.

ఆకులు రాలటం లో నవల అంతిమదశ ఒకపట్టున చదివిస్తుంది. పాత్రలు అన్నీ గాడమవుతాయి. దయానిధి, కోమలి ఇందిర నించి వచ్చిన టెలిగ్రాంకి స్పందిస్తారు. దయానిధి వెళుతుంటే కోమలి తనూ వస్తానని వేడుతుంది. ఇందిర పోయాక  ఇక అంతా ఈ భాగం కవితాత్మకతకు నిదర్శనం, నిలు వెత్తు ముకురం గా నిలుస్తుంది. ఈ భాగం కోమలి పేరెత్తితే, నిష్కారణంగా, నిష్కపటంగా,ఇలా దయ పొయెట్టి లోకి వెళిపోతాడు.
“where are the roaming
O” komali
In the wasteful valley
of poisoned honey?
In the arms of strong stupidity?
కాంతారావుతో వజ్రాలకబుర్లు. నిధి అతనితో బండిక్కి బయలుదేరుతాడు. వీడుకోలు అమృతం.

చివరకు మిగిలేది లో దయానిధి సాయంత్రం 6 కి ఇల్లు చేరుతాడు. క్షీరప్ప గనికోసం పెట్టుబడి వాటాదారు. అయినా గనికై ధనికులు పెట్టిన పెట్టుబడి పట్ల నిరాశ వుంది.నిధి చేరువవుతున్న కోమలిని కోప్పడతాడు. మృత్యువుకై ప్రశాంతంగా జీవనం సాగించాలనేది అతని దృక్పథం.
ఇలాంటి సమయంలో తనెవరినో ప్రేమిస్తున్నాడని అనుమానిస్తుంది. వచ్చిన కాత్యాయనిని కోమలికి లెంపకొట్టి గబగబా మెట్లకిందికి వెళ్ళిన ఆమెని కలుసుకుంటాడు.

ఇలా నిధి వలన కోమలికి కలిగిన అనంతానుభవాలవల్ల తాను మానసికంగా ఎదిగిపోతుంది. కవితాత్మక ఆలోచనలతో,జీవితంలో సంపర్కం చాలించుకుని ఏకాంతం లో వార్ధక్యం పొందింది. చివరకు మిగలనిదీ ప్రేమ ఒక్కటే! అనుకుంది.

అక్కడ పాకలు తగలబడుతుంటే శరీరం నిండా గాయాలవుతాయి. తగలబడుతు దూలం పడిన దానికింద కోమలి చెయ్యి, చీర తగల బడుతూ వున్నాయి. దూలంతో పెనగులాడి కోమలిని లాగాడు. కోమలి నుదుటి, చేతులు
పైనా దెబ్బలు తగిలాయి. స్వేచ్చాజీవి గుండె బరువుతో పెగలడం లేదు.

ఏదో మిగిలింది అంతా నాశనం కాలేదు.రెండు కవర్లు మిగిలాయి. చింపిన 2 కవర్లలో నూ ఒక దానిలోఇట్లు జనార్ధనం, మరో దానిలో ఇట్లు వైకుంఠం అనుంది. కీర్తి, ధనం, ఏవీ కాని చివరకు తనతో తాను సమాధానపడటం  మిగిలింది.ఇది ఇంత చక్కని శుభకృతి ముగింపు పలికిన నవలాకృతి ఇది చరిత్ర.

Also Read : జానపద గేయం – ఓ ప్రేమగీతం

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!