Survival is a Struggle : బ్రతుకే ఒక సమరం

బ్రతుకే ఒక సమరం

బ్రతుకే ఒక సమరం

తల్లి గర్భంలో నుంచే మొదలవుతుంది పోరాటం
తల బయటకు వచ్చినంతనే ఆకలి కేకల ఆరాటం
అయిదేళ్ళ వయసున ఆరంభం అక్షర యుద్ధం
చదువు ముగిసినంతనే తెరదీస్తుంది ఉద్యోగ సమరం
ప్రయత్నాలు ఫలించి బ్రతుకు తెరువు దొరికినంతనే
ఆలి కొరకు ఆత్రాన వయసు చేసే శృంగార కోలాటం
వారసుల రాకతో చాలీచాలని జీతం తెచ్చే
అప్పుల వరదల ఋణ భారపు జంఝాటం
పదవీ విరమణ లాభాలు బాకీలకు జమ కాగ
జీవన భారాన్ని బిడ్డలపై వేసిన వేళ పొందే ఛీత్కాలతో
గుండెల నిండా శేష జీవితంపై తెలియని వేదనల వలయం
పుట్టి చేటన పడినప్పటి నుంచి దినదిన గండంలా సాగుతూ
క్షణక్షణం ఎదురయ్యే సమస్యలను ఢీకొంటూ
జననం నుంచి మరణం వరకు కొనసాగే జీవితం
తేనె కోసం తిరిగే అవిశ్రాంత భ్రమరం
పాడె చేరే వరకు ఆగని బ్రతుకు సమరం

 

Also Read :  కంటకప్రాయమే

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!