సుఖీభవ
ఆకలి ,చదువుల ఆర్తనాదపు రోజులు
ఎండిన డొక్కా ఒకవైపు
సంకల పుస్తకాలు ఒకవైపు
గమ్యం తెలవని బ్రతుకు పోరాటం
ఎన్ని పాఠాలు నేర్పిందో
ఎన్ని గుణపాఠాలు చెప్పిందో
దేవుడెక్కడో వుండడు
మనుషుల రూపంలోనే
చేయుతవుతుంటాడు
అన్నం పెట్టి
ఆకలి తీర్చి
చదువుల తల్లి ఒడిలో
సెదతీర్చిన
ఆ ఆది దంపతులు
సుఖీభవ
Also Read : చిన్న పిల్లల నీతి కథలు