.నమ్మకంతో అడుగేయి
అమ్మ గర్భాన్ని దాటి అనుబంధాలు పెంచుకొనుటకు
నేల మీద వేస్తావు మొదటి అడుగు
ప్రయోజకుడవై ప్రపంచానికేదో చేయాలని
పాఠశాల గదిలో వేస్తావు మొదటి అడుగు
చదివిన చదువుకు సార్ధకత చేకూర్చాలని సమాజహితం కోసం
ఉద్యోగ బాధ్యతలతో వేస్తావు మొదటి అడుగు
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
నిరాశా నిస్పృహల విడనాడి
ధైర్యాన్ని వెంటేసుకుని
మొదటి అడుగు నువ్వేస్తే
సమాజమంతా నీ వెనుకే వస్తుంది
నువ్వు వేసే మొదటి అడుగే
నీ విజయాన్ని అప్పుడే అక్కడే నిర్ణయిస్తుంది
వేసే మొదటి అడుగులో ఫలితాన్ని సాధించలేకపోవచ్చు
కాని నమ్మకంతో వేసే తొలి అడుగు
నిన్ను విజయతీరాలకు తీసుకెల్తుంది
Also Read : మొదటి పాదం
