Soothing medicinal friend : ఓదార్పుల ఔషధనే మిత్రుడు
ఓదార్పుల ఔషధనే మిత్రుడు
ఓదార్పుల ఔషధనే మిత్రుడు..!!
గాయపడిన మనసుకు
దగ్గరుండి ఓదార్చే ఔషధం మిత్రుడు
చంద్రునిలా చల్లదనం వర్షిస్తూ
రక్త సంబంధం కలువ కున్న తోడుగా నిలిచే..
మాట్లాడే మాటల్లో తేడా ఉండొచ్చు
మనసులో కలిసిన భావాలు ఒక్కటే
పరిస్థితుల్లో మార్పులు చేర్పులు ఉన్నా
ప్రాణమిచ్చి కాపాడేది ఒక మిత్రుడే..
రెండు తనువులు విడిగా జీవించే
ఆత్మలు మాత్రం ఒకటిగా ప్రయాణించే
బహు బంధాల జీవన యాత్రలో
బ్రతుకంతా తోడుగా నిలిచిన బంధము అదే
సంతోషాలు మిఠాయిల్లా పంచితే
అందరూ వెంట నడుస్తూ ఉంటారు
దుఃఖంలో విషాన్ని మాత్రం స్వీకరించారు
విషాదాన్ని స్వీకరించి నిలిచే సముద్రం అతను
చిరునవ్వుల పలకరింపులు పెట్టుబడి
ఉషోదయములా మనసు విప్పే సూర్యుడు
మనస్ఫూర్తిగా మాట్లాడే తత్వం అతనిదే
నేలపై ఒక స్నేహితునికి మాత్రమే సొంతం..
చికాకులున్న మనసుకు మాయం చేసే మంత్రం
స్నేహితుని చిరు దరహాస ముఖారవిందమే
చల్లని చూపుల నేత్ర ఛాయలే స్నేహపు చలివేంద్రం
అలసిన మనసుకు ఒయాసిస్ లా సేద తీర్చు
ప్రేమించే గుణమున్న స్నేహితుడే
దండించి దారిలో పెట్టగల సమర్ధుడు
నీలో తప్పులను ఒంటరిగా నిందిస్తూ
నీ గొప్పలను నలుగురికి పంచేవాడే నిజమైన నేస్తం
Also Read : సమన్యాయం