స్థితప్రజ్ఞత
అనుభవ మడతల్లో వయసు ముడతలతో
తలపండి ఎదనిబ్బరానికి మాట కట్టుబడికి
నియమ నిబద్ధతను కూడగట్టి బాధ్యతను
మూటగట్టి నిజాయితికి పట్టమే పెద్దరికం
తప్పును తప్పుగా బాహాటంగా ఒప్పుకుంటూ
చెప్పుచేతల్లో వ్యవహారం సజావుగా నడిపే
సామర్థ్యం అనుసరించినపుడే గౌరవం పెరిగే
మన్ననలందుకొనే మంచిమనసుకు గుర్తింపు
చిన్నవాళ్ల పొరబాట్లను క్షమించి సరిదిద్దుతూ
సలహాదారుగా సఖ్యత సమకూర్చే తత్వాన్ని
సామరస్య పరిష్కారానికి మార్గదర్శక సూచనకు
ఆదర్శవంతమై మనగలిగే మర్యాదిచ్చే గుణమై
చాదస్తపు ఆలోచనల్ని దూరంగా నెట్టేసి మనసుతో
జయించే వర్తమానపు స్థితప్రజ్ఞతకు తావిస్తూ
కార్యాచరణలో కర్తవ్యాన్ని బోధించే మనసుతనం
సంపూర్ణమై గీతోపదేశ కృష్ణుడై పెద్దరికం నిలపాలి
Also Read : సంబంధం