మన తెలుగు
దేశ భాషలందు తెలుగు లెస్స
ఎవరి ఘోష ఎట్టిదైనా ఏమైనా
తేనెలొలుకు పలుకులతో
తీయనైన తళుకులతో
స్వచ్చమైన పైరుగాలిలా
అచ్చమైన నుడికారంతో
ఎన్నెన్నో సాహిత్య
రచనల సంపదను
ఎందరో మహనీయులు
మనకు అందించారు
తెలుగు భాషా గొప్పతనాన్ని
తమిళకవి భారతియార్ కొనియాడి
సుందరమైన తెలుగులో
రచనలు చేయండంటూ ప్రస్తుతించారు
అంతటి మిన్నంటే
గొప్పదైన మన భాషను
అరువులేని అరుపుల్లేని
అందమైన ఆలాపనలాంటి
మాతృభాషను ప్రేమించి
గౌరవించి కాపాడుకుందాం
Also Read : నా ఇలవేల్పు నా తెలుగు