విజయానికి అభయం
మొదటి అడుగు ఒంటరి
దాని జాడ కంటిరా
కానున్నది మిన్నంటురా
అడుసులోన వేయకు
జడుపులేక వేయరా
మొదటి అడుగు నువ్వు వేస్తె వేల అడుగులు వెంటవస్తాయ్
విజయమెంత తేలికో ,
అభయమిచ్చే నేస్తమే
యుద్దమెంత భారమో,
మోసేటి పాదమే
సమయమెంత సత్యమో
స్ఫూర్తి నిచ్చు నిత్యమూ
అనుభవాన్ని స్వాగతించే
ఉత్సాహానికి ప్రోత్సాహమే
ఉరకలెత్తే ఉత్తేజమే
నిందలని త్రొక్కుకుంటూ
నిజాన్ని నిరూపిస్తూ
భారమైన పని అయినా
దూరమెంతైనా తోటి వారికి త్రోవ చూపే నేస్తం
వెన్నుతట్టి ప్రోత్సహించే విలువైన బలం
లక్ష్యానికి శిక్షణగా అనుసరించే ఆయుధం
Also Read : .నమ్మకంతో అడుగేయి