రక్షకుడు
ఆదియుగాల నుండి ఆదినారాయణుండు
ఆర్త జనుల మొర ఆలకించి ఆదుకొనుచుండె
దశ అవతారములనెత్తి ధరియిత్రిలోన
ఆపదల నాదుకొను ఆదినారాయణుండె ఆపద్భాందవుడు.
కలియుగంబున శ్రీనివాసుండు శిలారూపంబు నుండి
నీతి, నియమం, ధర్మం, మంచి, మానవత్మం గల మనుషుల మదిలో నడయాడుతూ,
అన్ని రూపాలుతానై ఆదుకొనుచుండు ఆత్మజనరక్షకుడు
రేయనక, పగలనక కష్టించే కష్టజీవులు
దేశరక్షణలో జవానుగ, ఆకలి బాధను తీర్చ అన్నదాతగ
పరిశ్రమలలో శ్రామికునిగా, పారిశుధ్యంలో కార్మికులుగా
రక్షణలో రక్షకభటుడిగా, న్యాయంలో న్యాయవాదిగా
విద్యనుపదేశించ అధ్యాపకుడిగా , వైద్యరంగాన వైద్యునిగా
అవసరాలలోను, ఆపదలలోను ఆదుకొను వీరందరూ ఆపద్భాందవులే
నోరెండు వారికి నీరిచ్చువాడు, అన్నార్తికి ఆహారం అందించేవాడు
ప్రకృతి వైపరిత్యాలలో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వారికి అభయ హస్తము ఇచ్చి ఆదుకొనేవాడు.
పట్టెడన్నం కోసం పాట్లుపడుతుంటే పాయిసాన్నం తెచ్చిపంచి పెట్టేవాడు
ఆపదలనున్న వారిని ఆడుకొనేవారే ఆపద్భాందవులు
Also Read : సఖుడు
.