Rainbow : హరివిల్లు
హరివిల్లు
మబ్బు కురిస్తే వాన
వాన వెలిస్తే నీరెండన
హరివిల్లు విరిసేను ఆకాశాన
పిల్లలు మురిసేను సంబురాన..
అంబరాన హరివిల్లును
చూడగానే గంతులేస్తారు
చప్పట్లుతో చిందులేస్తారు పిల్లలు
బాల్యానికి తీపిగుర్తు హరివిల్లు..
హరివిల్లు ఆ గగనాన
వరుణుడు కట్టే వంతెన
అది సప్తవర్ణ శోభితం
అది అపురూప దృశ్యం..
హరివిల్లు అందాలు చిందిస్తుంది
హరివిల్లు కనులు మురిపిస్తుంది
హరివిల్లు ఆనందం పంచుతుంది
హరివిల్లు మదిని పరవశించేస్తుంది
Also Read : నా బలం