ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
అక్షరాయుధం నీకు ప్రణామములు
అక్షరమాలను గుచ్చేస్తా అమ్ముల పొదల్లో అమరుస్తా
అక్షర శరములతో అంతరిక్షానికి వారధి కట్టేస్తా
అక్షర జ్యోతిని వెలిగిస్తా అక్షర జ్ఞానం కలిగిస్తా
అంతర్జాలంలో ఇంటర్నెట్ క్రియేట్ చేస్తా
అంతరిక్ష నియమాలకు అందరిని అర్హులు చేస్తా
అణువులనే అణ్వస్త్రాలుగా మార్చేస్తా
ఉగ్రవాదానికి ఉత్ప్రేక్షాన్ని జోడించి ఊచ కోత కోసేస్తా
ఓనమాలు నేర్వాలంటూ ఓం శక్తికి ప్రాణం పోస్తా
నాట్య మయూరిలా పురివిప్పిన నక్సలిజాన్ని నవ్వుల పాలు చేస్తా
మత్తేభవ బాణాలతో మావోయిస్టులను మట్టికరుస్తా
మారణ హోమాలను అంతం చేసి శాంతి కపోతాలను ఎగరవేస్తా
వరకట్న పిశాచానికి వజ్రాయుధాన్నై నవవధువుకు ఆయువు పోస్తా
దిశ చట్టాన్ని నిర్దిష్టంగా అమలు చేస్తూ నిలువెత్తు దర్పణంలా నిలుస్తా
బాల కార్మికులను చదువుల తల్లి బడిలో సేదతీరేలా చట్టాలు చేస్తా
కామాంధులకు కఠిన కారాగారాన్ని ఎంచి ఉరిని అమలు చేస్తా
అధికారుల అవినీతికి ఆయుధాన్నై నియామక ఉత్తర్వులు రద్దు చేస్తా
అక్షరాలు భాషలు వేరైనా భావం ఒక్కటే అంటూ విలువలను పోషిస్తా
చంపక అశోక మాలలతో సప్త స్వరాలనే పలికిస్తా
శార్దూలములతో శాసనాలు చేస్తూ అన్నింట అక్షరమే ఆయుధం చేస్తా
అందుకే అక్షర ఆయుధమా నీకు శతకోటి ప్రణామములు
Also Read : అన్నీ అక్షరమై