కవి కలం
న్యాయాన్ని చంపినప్పుడు
ధర్మాన్ని ధ్వంసం చేసినప్పుడు
నిజాయితీని హింసించినప్పుడు
అవినీతి రాజ్యమేలినప్పుడు
ప్రశ్నించే గొంతును నులిమినప్పుడు
ప్రభుత్వం పై ప్రజాపోరాటం సాగినప్పుడు
మనిషిని మనిషే దగా చేసినప్పుడు
మానవత్వం మంట గలిసినప్పుడు
అన్యాయాన్ని అధర్మాన్ని
అవినీతిని అక్రమాల్ని
పెన్నును గన్నుగా మార్చి
లెటర్స్ ను బుల్లెట్స్ గా చేసి
నేను సైతం అంటూ ఎదిరించాలి
కవి సమరం సాగించాలి..
కవి కలం ఉరుమాలి
కవనం పిడుగులు కురిపించాలి
Also Read : నేను సైతం