కవితాశిల్పం
గొంతెత్తి చాటాలి నీ మమసుకు చలనం వస్తే
కలమే నీ ఆభరణం కావాలి తట్టి చూస్తే
మనోరూపం దాల్చాలి నీ భావాన్ని వెలికి తీస్తే
నువ్వే ఓ శిల్పాన్ని చెక్కాలి అవకాశమొస్తే
కళ్లల్లో నీరు ఇంకిపోవాలి నీకు బాధనిపిస్తే
కాలంలో చిందించాలి నీకు ఆవేదన వస్తే
దుఖావేశంతో నువ్వు ఇతరులను శాసిస్తే
నీకు నువ్వే శత్రువు అవుతవు గమనిస్తే
పెదవి దాటి పదం రాదు నీకు సిగ్గనిపిస్తే
విధిగా నువ్వు కలం తిప్పు బయమనిపిస్తే
నీలో నీకు తెలియని మనిషున్నాడు గుర్తిస్తే
కవితాశిల్పంగా మలుచుకుంటాం అవకాశమొస్తే
ఉగ్రరూపం తలపించే ఎరుపెక్కిన నీ కళ్లు చూస్తే
ఉన్మాదిగా మారక, చిరునవ్వు చిందిస్తావు
ఒక్కసారి మనసు పెట్టి, అక్షరాల అమరిక చూస్తే
అదే కలానికి ఉన్న గొప్ప, గళంతో పోలిస్తే.
Also Read : కలం – గళం