Poet of Rainbow : హరివిల్లు

హరివిల్లు

 

హరివిల్లు

తన పొత్తిళ్ళలోని పురిటిబిడ్డ హరివిల్లును

నీలాకాశం ఆశగా తడిమి చూసుకుంది.

వర్ణములు లోపించిన బిడ్డను చూసి

గుండెలవిసేలా ఆక్రోషించింది

నెలవంక చేతికందించి వర్ణములు నింపమని వేడుకొంది

మనసులో భారం తగ్గి నిశ్చింతగా కనులు మూసుకుంది

కానీ

ఓ బలహీన క్షణంలో నీలాకాశం చీకటి మాయలో పడింది

వివేకం నశించి, దురాశ  పెరిగి దిద్దుకోలేని పొరబాటు చేసింది.

తన గారాల పట్టి హరివిల్లుకి రంగులద్దుతున్న

చంద్రవంక చేతుల్లోంచి హరివిల్లును గబుక్కున లాగేసుకుంది

చీకటికందించింది.

అంతే

చీకటి మాట మార్చింది.

అంధకారం ఆవహించింది

హరివిల్లు వెలవెల బోయింది నెలవంక చిన్నబోయింది

నీలాకాశం నిర్ఘాంతపోయింది

కన్నీరొలుకు కళ్ళతో హరివిల్లు నీలాకాశం వైపు  బేలగా చూడసాగింది

తన అవివేకానికి నీలాకాశం  సిగ్గుతో తల దించుకుంది

 

Also Read : విజయదశమి

 

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!