Failure to Success – Poem : ఓటమి గెలుపుకు నాంది
ఓటమి గెలుపుకు నాంది
ఓటమి గెలుపుకు నాంది
ఓటమి తలరాత కాలేదు
జీవనరేఖ గీసి పోలేదు
సాధిస్తే చేకూరే ఫలం
సాధనలోనే విఫలం
గుణ పాఠాలు నేర్పే పుస్తకం
అధ్యాయము చేసే మస్తకం
అనునిత్యం గుర్తుచేసే వేదన
సాధించేందుకు వెన్నంటే సాధన
ప్రయత్నాలకు మలుపు
నిత్య శోధనలతో గెలుపు
రేపటికి అవకాశాలు కల్పించే
మర్నాటికి ఓటమిని తప్పించే
నమ్మకానికి ఉత్ప్రేరకం
ఆశల చిగుళ్లకు నమ్మకం
ఓటమి తాత్కాలికమే
ఆలోచనలకు అదే బీజమే
ఏకాగ్రతను నమ్మి పొమ్ము
విజయ హారముమే నీ సొమ్ము
దృఢమైన అడుగులే ముందుకు
జీవితంలో గెలుపు వేసేందుకు
ప్రయాణములో పడిపోకు
జయకేతనం ఎప్పుడు జారనీకు
ఏది శాశ్వతము కాదు
వచ్చినది ఎప్పటికీ పోదు
ఓటమిని ప్రేమించు
గెలుపును ఆస్వాదించు
వడిదుడుకులను తట్టుకో
జీవన ప్రయాణం మెరుగుపరుచుకో
Also Read : ప్రతి ఓటమి గెలుపే