కలం గళమెత్తే
ఇది గేయం కాదు
గమనించని గాయం
ఇవి అక్షరాలు మాత్రమేనా?
వ్యథానివిస్టుల జఠరాగ్నిహోత్రపు
ధగ ధగాలు కవా
కలం కదిలించి వెలయించినావా
ఉబికి రాదా విప్లవ లావా?
కలం ములుకులో బలం సిరాగ్ని
గళం గర్జన దాన్నెగదోసే
ప్రభంజన ఝకావా
మనోబిక్షలంలో మ్రగ్గిన
గుగ్గిలాన్ని బుగ్గిచేసే బడబాగ్ని
కలం వెలువరించే కవితాగ్ని
గళం నెగళ్ళలోని త్రేతాగ్ని
నియతి లేక దూకే నిటలాగ్ని
కలం గళమెత్తేది
కాకా పట్టేందుకు కాదు
బాకాలూదడానికి కాదు
ఏకమై కదిలేందుకు
ఏకు మేకై ఎదిగేందుకు
నిదురించిన మెదళ్ళలో
ఆలోచనలని అక్షరాలుగా
మొలకెత్తించి ఎత్తించి
ఆవేశాలుగా ఆవహించేందుకు
అహంకారాన్ని అధిక్షేపించేందుకు
Also Read : కవితాశిల్పం