నింగీ నేల
నువ్వూ నేనూ ఒకటేనా
నింగీ నేల కలవని వింతేగదా
కలిసీ కలియని కలిసినట్లుండే
విరుద్ధ స్వభావాల కలయికే మన చెలిమి
నేను చేసినదేదైనా,మాట్లాడేదైనా
నా భుజం తట్టి సంతృప్తిగా
నా నవ్వును గ్రహించి మసలే భావన
నన్ను ఆకట్టుకుంటుంది నీ చెలిమితో
నీ చిరుస్పర్శ అమ్మ ఆత్మీయత
పొంగిపొరలే నదీమతల్లిలా
నిత్యమూ మనోతరంగమై
వీడని నీ సావాసం ఎద ఆవాసమై
ఒకరినొకరు పలకరింపుల్లో
పులకింతల జీవనయానంలో
ఒడిదుడుకులు తట్టుకుంటూ
కలిసి సాగడమే పరమార్థం,మన చెలిమి
Also Read : గుండెను హత్తుకునే