విజయ పరిమళం
గతం కవితైతే
గళం భవితవును
కలం విదిలించిన కవితలో
గతం విధి లిఖించిన నిజం
గళం ఎదురీతల మునకలో
జయం ఎన్నోరీతుల నిశ్చయం
కలం విసిరిన కవితల వలలో
కాలం రాసిన కవితలు వేలం
కలం బలమై గళమెత్తగా
కాలంతో పరుగెత్తగా
కలవరము లేని కళగా మిగలగా
కలతలు లేని వరములు కురియవా?
ఉదయాలను చిలికిన కలం
అభ్యుదయాన్ని వెలికితీయాలి
అదరాలను మీటే గళం
హృదయాలను తాకాలి
కలం గళం కలగలిపి విరిసిన విజయ పరిమళం
కరిగిపోయిన కాలాన్ని కరిగించి
జ్ఞాపకాల మూసలో పోతపోసి
అజ్ఞానపు దారులకు మూతవేసి
విజ్ఞాన సమీపాలకు తెర తీసి
విజయ తీరాన్ని సమీపించాలి
Also Read : కలం కాగడా
.