మన తెలుగు
మాతృభాష మణిహారం మన తెలుగు
సుమగంధాల మకరందం మన తెలుగు
అమ్మ పాలకమ్మదనం అమృత కడలి
భాండాగారం మన తెలుగు
నన్నయ్య రుచిరార్థనిధిత్వం మన తెలుగు
సోమయాజి రసరమ్య కవిత్వం మన తెలుగు
ఎఱ్ఱన భావం స్పారక ప్రబంధం
పోతన భాగవతం బ్రతుకు చిత్రం మన తెలుగు
శ్రీనాధ మధుర విలాసాల విహారం మన తెలుగు
క్షేత్రయ్య మువ్వ పదాలు ,త్యాగయ్య ,రామదాసులు
కీర్తనల చక్కెర కేళి మన తెలుగు
మొల్ల,తిమ్మక్కలు రాసిన రాజసం మన తెలుగు
వాగ్గేయ కారుడు అన్నమయ్య ఆలపించేదే తెలుగు
సాహిత్య సమరాంగణ శ్రీకృష్ణదేవరాయల
భువన విజయమే మన తెలుగు .
వేయిపడగల మణుల విశ్వనాథ విలువలు
ఎంకిపాటల ,ఊడలమ్మ కథల ఊయలలు
గురజాడ ముత్యాల సరాలు మన తెలుగు
ఛందస్సు విల్లు ఇంద్రధనుస్సు మన తెలుగు.
శతకాల సిరి సుభాషితాల గిరి
సూక్తులు, ఛలోకోక్తుల కళలు మనతెలుగు చమత్కార పద విన్యాస,
వైతాళికుల నిప్పురవ్వల మేలుకొలుపు పాటలే మన తెలుగు
ఎంతని చెప్పను మాతృభాష వైభవం
మన తెలుగు శారద శౌర్యం
Also Read : తెలుగు వెలుగు