ఒకటే హృది
కలిమి లేమిని చూడనిది
కులము మతము చూడనిది
ఆస్తులు అంతస్థులు చూడనిది
నిన్ను నిన్నుగా చూసేది
నీ కోసమే తపియించేది…
కష్టాలలో కన్నీళ్లలో తోడుగా నిలిచేది
రక్తబంధం బంధువుల కన్నా మిన్నది
శరీరాలు రెండుగ వున్నా ఒకటే హృది
దేవుడు సృష్టించని బంధం
అదే..అదే..చెలిమి బంధం
Also Read : స్నేహమేరా జీవితం