నా ఇలవేల్పు నా తెలుగు
తేటతెలుగు తేనీయ మధురమై తెలుగు వాడి ఇలవేల్పయి
ఉగ్గుపాలతోని ఊపిరిని పోసి అమ్మ పిలుపులో అమృతమయి
ఖండాంతరాలను దాటి ఎన్నో ఎదలను మీటి అఖండ ఖ్యాతి నొంది
పక్క అణెము వాడి గొంతుకలో తేనెలూరి పలుదిశల జీవమొల్కి
చిన్నయ్య విరచితమున చందస్సు వ్యాకరణంబుగా చిందులేసి
అలంకారాలతో భావాలను నింపి అలవోకగా అర్ధబంధాలు దెల్పి
సామెతలందు సూక్తుల ,చమత్కారాలతో నవ్వులను పూయించి
నీతి పల్కులతో వేమన పద్యాలు జనుల నాలుకలపై నాట్యమాడి
గిడుగు వాడుక స్వరమై ,ఘంటసాల గాత్రమై విరిసి
జానపదాలతో యాసను అవని యంతట చాటి ఖ్యాతిని పెంచి
శంకరం బాడి సుందరా చారి సువర్ణ గేయమే పాఠశాలల్లో ప్రార్ధనా గేయమై
రచయితల రంగస్థలంలో ఆయుధాల వేట దేశ భాషలందు తెలుగు లెస్సగా
పచ్చిపాల నురుగువలె స్వచ్ఛమైన అనురాగాల ధారా
అమృతపు కలశమున కురిసేటి కనకపు సిరుల పంట
తరతరాలకు సంస్కృతితో సంస్కారం నేర్పిగా పలకరింపులో మమతను పంచి
గురజాడ రచన నాణ్యమైన నవరసాలకు నిర్వచనమై
అక్షర అక్షరము పదాల అల్లికతో వాక్యపు సరులతో ఒదిగి
నిత్యం విరిజిల్లే తెలుగు తల్లి మెడను హత్తుకున్న మణిహారం
జగమున వెలుగుతున్నటి సిరిమల్లి జగతి సిగను ముద్దాడుతున్న జాబిల్లి
జయ జయ ద్వానాల నడుమన వెన్నలల్లె వెలుగును పంచుతున్నది మన తెలుగు
Also Read : తెలుగు – వెలుగు