మకరందం
తెలుగు ఇజంతో చెలిమి
అక్షరాలకు బలిమి
కవితలకు మిసిమి
సాహిత్యానికి కలిమి
ఒంటరైన క్షణంలో
మనసును పలకరించేది
మౌనాన్ని వీడేలా చేసేది
కష్టాలలో కన్నీరు తుడిచేది
ఆపదలలో అండగా ఉండేది చెలిమి.
వయసుతో సంబంధం లేనిది
బాధల్లో ఓదార్పునిచ్చేది
ఆనందంలో ఆత్మ బంధువయ్యేది
సృష్టిలో తీయనైనది చెలిమి.
తరిగిపోని చెలమలా
ఇంకిపోని సముద్రంలా
చీకటిలో వెలుగులా
పువ్వులోని మకరందంలా
హరివిల్లులోని రంగులమయంలా
కంటికి కంటిపాపలా
కృష్ణ,కుచేలుని చెలిమిలా
కలిమి, లేముల భేదం లేకుండా కలకాలం నిలవాలి మన స్నేహం.
Also Read : అనురాగ బంధం