My Strength : నా బలం
నా బలం
నా బలం
పరీక్షల్లో తప్పినప్పుడు
అమ్మచెప్పిన అపురూపమైన మాటలే,నా బలం
పరీక్ష ఫలితాలు చూసి క్రుంగిపోయినప్పుడు
ఉపాధ్యాయులు చెప్పిన స్వాంతన మాటలే,నా బలం
జీవిత గమనంలో అలసిపోయినప్పుడు
నాన్న చెప్పిన ధైర్యపు మాటలే,నా బలం
నిరాశ నిశిలో అలమటించినప్పుడు
తన మాటలతో ఆశాదీపాలు వెలిగించిన నా సహచరే,నా బలం
కష్టాల కడలిలో చిక్కుకున్నప్పుడు
తన మాటల చేయూత నందించిన మిత్రడే,నా బలం
బహుదూరపు బాటసారిగా అలసిన బ్రతుకున
బిడ్డల ప్రేమామృత మాటలే,నా బలం
శ్రీ కృష్ణుడు ప్రభోదించిన అద్భుతమైన
భగవధ్గీత సుధాసారమే,నా బలం
ఆ అనుభవాలతో వచ్చిన గొప్పబలం
అదే నన్ను నడిపించే ఆత్మబలం,నా బలం
Also Read : మాతృభూమి