నా మాతృభాష
అజ్ఞానాంధకార విచ్చిన్న జ్వాలా కిరణం తెలుగు
అలసిపోయిన ఆర్ద్ర హృదయాలను తట్టే పల్లె పాట తెలుగు
అమ్మ స్పర్శతో పులకించే బిడ్డ తొలి పలుకు తెలుగు
నాన్న శ్రమతో అలసినపుడు పిల్లల నిష్కల్మష నవ్వుతోటి నిండిన మోము పలుకు తెలుగు
దిగ్విజయకేతనాలు ఎగరేసిన నా భూసార్వభౌముల ఇంట నడయాడిన వెలుగు తెలుగు
కవి సామ్రాట్ ల పద నాట్య విన్యాసం పురిగొల్పే తెలుగు
ఉచ్వాస నిశ్వాస ల యందు వినికిడయ్యే శబ్ద తరంగం తెలుగు
సంభాషలను మేళవించి స్థిత ప్రజ్ఞత చేకూర్చే శిఖరం తెలుగు
భావవ్యక్తీకరణ స్వేచ్ఛా కుసుమం తెలుగు
విభిన్న భావజాతుల సమ్మిళిత సమ్మేళన ప్రయాణ మార్గం తెలుగు
ఊహాలోక విపంచిలో ఎగిరే కలలకు కధాసంపుటి తెలుగు
నిర్మొహమాట పదఝంకారం ఘీంకరింపు తెలుగు
దైవాన్ని ప్రార్దించే సుపలుకుల పుష్పమాల స్తుతి తెలుగు
తెలుగు గడ్డ యందు తెలుగు బిడ్డ నేర్చే తొలి అక్షర తోరణం తెలుగు
అమ్మ శారదా కృపా కటాక్ష వీక్షణం లేనిదే నీకు తెలుగేది
అందుకే చరిత్రనొసగి సంభాషించు వాక్కు నీ తెలుగు,నా తెలుగు,మన తెలుగు నందు
Also Read : నవరస మాధురి