నా దేశం
నా భారతదేశం నందనవనమే
నిత్యజీవన సంస్కృతి చిహ్నమే
వీరోచిత గాథలకు పౌరుష పరాక్రమాలకు
విప్లవ ఉద్యమ చైతన్య భావాలకు నిలయమే
గంగా యమున గోదావరి వంటి జీవనదుల స్థానమే
ఇతిహాసాలకు వేదాలకు పురాణాలకు సంగీత సాహిత్య సకల కళలకు
మహానాయకులకు మహనీయులకు మాతృమూర్తి రూపమే
హిందూ జైన బౌద్ధ ఇస్లాం మతాలు విలసిల్లిన ప్రాంతమే
మేథావులకు జ్ఞానులకు చరిత్రలో నిలచిన సంస్కర్తలకు
చిత్రాలకు విచిత్రాలకు అజంతా యెల్లోరా చారిత్రక అద్భుతాలకు
తరాలు మారినా సమతా మమతల సమానత్వ భావనలకు
ప్రపంచానికి పాఠాలు నేర్పే సంస్కృతికి శాస్త్రాలకు మూలమే
ఇక్కడి నేల గాలి స్పర్శిస్తే నాలో అణువణువు పులకింపే
నా దేశభక్తికి నిదర్శనమే
సారె జహాసే అచ్చా మేరా భార్త్ మహాన్ మా వాదమే
ఈ విశ్వంలో పరమ పావని పుణ్య ధరిత్రి నా దేశమే
Also Read : ధిక్సుచి