గెలుపోటములు
కలిసి రాలేదంటూ కాలాన్ని నిందించకు
కలలుకంటూ సమయాన్ని వృధా చేయకు
కన్న కలలు సాకారం చేసుకునే దిశగా పయనించు
ఓటమి అన్నది కారాదు నీ జీవితంలో ఆఖరి మెట్టు
గెలిచిన నాడు అందరిని చూసి గర్వించకు
ఓడిన నాడు నిన్ను నువ్వు నిందించుకోకు
కెరటం యొక్క అలుపెరగని పోరాటం చూడు
పదే పదే ప్రయత్నించు అంటుంది.
ఎన్నడూ వెన్ను చూపని కాలాన్నిచూసి నేర్చుకో
ముందుకు సాగిపో
సహనాన్ని వీడకు కడదాకా
నీకు తోడు ఉంటుంది కనుక
సంకల్పం ఉంటే కడలిని కూడా
అవలీలగా అవతలివైపుకు ఈద గలవు
గెలుపు అన్నది ఒకరి సొత్తు కాదు
నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ
నిరాశ నిస్పృహలు నీ దరి చేరనీయక
మనో ధైర్యాన్ని కూడగట్టుకుని
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపో
గెలుపోటములు సహజం కనుక
ప్రయత్నించకుండానే ఫలితం ఆశించకు
కృషి ఉంటే అసాధ్యమైనది ఏది లేదు
విజయం అన్నది వెంటనే రాదు
ప్రయత్నిస్తే పోయేది ఏముంది
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపో !
Also Read : ఉగాది పండగ విశిష్టత